కారు ప్రమాదానికి కారణం పెద్దపులి కాదు

శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో జరిగిన కారు ప్రమాదానికి పెద్దపులి కారణమన్న వార్తలో నిజం లేదని జిల్లా అటవీ అధికారి (డీఎఫ్‌ఓ) ఆవుల చంద్రశేఖర్‌ తెలిపారు. మంగళవారం ఈ విషయంపై నెల్లూరులో ఆయన వివరాలు వెల్లడించారు.

Published : 19 Jun 2024 04:34 IST

శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఘటనపై డీఎఫ్‌ఓ వివరణ

వివరాలు వెల్లడిస్తున్న డీఎఫ్‌ఓ చంద్రశేఖర్‌

నెల్లూరు(వీఆర్సీ సెంటరు), న్యూస్‌టుడే: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో జరిగిన కారు ప్రమాదానికి పెద్దపులి కారణమన్న వార్తలో నిజం లేదని జిల్లా అటవీ అధికారి (డీఎఫ్‌ఓ) ఆవుల చంద్రశేఖర్‌ తెలిపారు. మంగళవారం ఈ విషయంపై నెల్లూరులో ఆయన వివరాలు వెల్లడించారు. ‘ప్రమాదానికి గురైన కారు ఇనుప బంపర్‌ పూర్తిగా లోపలికి వంగిపోయింది. ఏ జంతువు ఢీకొన్నా వాహనం అంత ప్రమాదానికి గురి కాదు.  పైగా అక్కడ ఎటువంటి రక్తపు మరకలూ లేవు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో వన్యప్రాణులు విరివిగా సంచరిస్తాయి. అక్కడికి సమీపంలో వన్యప్రాణుల పాదముద్రలు గుర్తించి ప్రయోగశాలకు పంపించాం. అవి పులివైనా కావొచ్చు లేదా చిరుతవైనా కావొచ్చు. అయితే ఆ జంతువు కారణంగా ఈ ప్రమాదం జరగలేదు’ అని డీఎఫ్‌ఓ వెల్లడించారు. ప్రమాద స్థలంలో కూంబింగ్‌ చేస్తున్నామని.. ప్రత్యేక బృందాలు, డ్రోన్‌లతో పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. మరోవైపు కారుకు ప్రమాదం ఎలా జరిగిందనే అంశంపై దర్యాప్తు కొనసాగుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని