ఆలయాల పూర్వ వైభవానికి కృషి: మంత్రి ఆనం రామనారాయణరెడ్డి

రాష్ట్రంలోని ఆలయాల అభివృద్ధి, పునర్నిర్మాణ పనులపై ప్రత్యేక దృష్టి సారించి పూర్వ వైభవానికి కృషి చేస్తానని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు.

Published : 19 Jun 2024 04:42 IST

నెల్లూరు (కలెక్టరేట్‌), న్యూస్‌టుడే: రాష్ట్రంలోని ఆలయాల అభివృద్ధి, పునర్నిర్మాణ పనులపై ప్రత్యేక దృష్టి సారించి పూర్వ వైభవానికి కృషి చేస్తానని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. మంగళవారం నెల్లూరు సంతపేటలోని నివాసంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. ‘రాష్ట్రంలో శతాబ్దాల చరిత్ర ఉన్న ఎన్నో ఆలయాలున్నాయి. వీటి అభివృద్ధి పనులపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడి చర్యలు చేపడతాం. ప్రధాన ఆలయాలను మరింత పటిష్ఠం చేయాల్సిన అవసరముంది. దేవాదాయశాఖలో ప్రక్షాళన చేపట్టి సమూల మార్పులకు శ్రీకారం చుడతాం. పలు ఆలయాలకు వందల ఎకరాల భూములు, ఆస్తులున్నా అభివృద్ధికి నోచుకోవడం లేదు. ఇలాంటి వాటిని గుర్తించి ఆస్తుల పరిరక్షణకు చట్ట ప్రకారం చర్యలు చేపడతాం’ అని తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని