ఇళ్ల నిర్మాణాల పూర్తికి కార్యాచరణ రూపొందించండి

రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ఇళ్లను సకాలంలో పూర్తి చేయడానికి అవసరమైన కార్యాచరణ రూపొందించాలని గృహనిర్మాణశాఖ మంత్రి కొలుసు పార్థసారథి అధికారులను ఆదేశించారు.

Published : 19 Jun 2024 04:43 IST

అధికారులకు మంత్రి కొలుసు పార్థసారథి ఆదేశం

ఈనాడు డిజిటల్, అమరావతి: రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ఇళ్లను సకాలంలో పూర్తి చేయడానికి అవసరమైన కార్యాచరణ రూపొందించాలని గృహనిర్మాణశాఖ మంత్రి కొలుసు పార్థసారథి అధికారులను ఆదేశించారు. గృహ నిర్మాణ సంస్థ చేపట్టిన అభివృద్ధి పనులపై విజయవాడలోని ప్రధాన కార్యాలయంలో మంగళవారం ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. నిర్మాణాలు ఏ దశలో ఉన్నాయో అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పార్థసారథి మాట్లాడుతూ.. కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధుల మంజూరుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలన్నారు. ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని