తూకం సరిగ్గా లేకపోతే కఠిన చర్యలు: పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌

రాష్ట్రంలో పౌర సరఫరాలశాఖ పరిధిలోని 24 నిల్వ కేంద్రాల్లో కందిపప్పు, పామోలిన్, పంచదార ప్యాకెట్ల తూకం నిర్దేశిత పరిమాణం కంటే తక్కువగా ఉన్నట్లు గుర్తించి కేసులు నమోదు చేశామని ఆహార, పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ తెలిపారు.

Published : 19 Jun 2024 04:43 IST

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో పౌర సరఫరాలశాఖ పరిధిలోని 24 నిల్వ కేంద్రాల్లో కందిపప్పు, పామోలిన్, పంచదార ప్యాకెట్ల తూకం నిర్దేశిత పరిమాణం కంటే తక్కువగా ఉన్నట్లు గుర్తించి కేసులు నమోదు చేశామని ఆహార, పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. గురువారం లోగా అన్ని నిల్వ కేంద్రాల్లోనూ తనిఖీలు పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించినట్లు ఆయన వివరించారు. విజయవాడలోని పౌరసరఫరాలశాఖ కమిషనరేట్‌లో మంగళవారం ఆయన తూనికలు, కొలతల శాఖ అధికారులతో సమీక్షించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. ‘రెండు రోజుల కిందట తెనాలిలో మండల స్థాయి పౌర సరఫరాలశాఖ నిల్వ కేంద్రాన్ని పరిశీలించినప్పుడు కందిపప్పు, పామోలిన్, పంచదార ప్యాకెట్లలో 50 నుంచి 80 గ్రాముల తేడా స్పష్టంగా కన్పించింది. వాటి సరఫరాలో ప్రమేయం ఉన్న అందరిపైనా కఠిన చర్యలు తీసుకుంటాం’ అని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని