మంత్రులకు ఛాంబర్లు కేటాయింపు

రాష్ట్ర సచివాలయంలో మంత్రులకు ఛాంబర్లు కేటాయిస్తూ సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) ఉత్తర్వులు జారీ చేసింది. మొదటి బ్లాక్‌లో సీఎం చంద్రబాబు కొనసాగుతున్నారు.

Published : 19 Jun 2024 04:56 IST

ఈనాడు, అమరావతి: రాష్ట్ర సచివాలయంలో మంత్రులకు ఛాంబర్లు కేటాయిస్తూ సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) ఉత్తర్వులు జారీ చేసింది. మొదటి బ్లాక్‌లో సీఎం చంద్రబాబు కొనసాగుతున్నారు. మిగిలిన నాలుగు బ్లాకుల్లో మంత్రులకు కార్యాలయాలను జీఏడీ కేటాయించింది. జనసేన నుంచి మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న పవన్‌ కల్యాణ్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేశ్‌లకు రెండో బ్లాక్‌లో ఛాంబర్లను కేటాయించింది. ఇదే బ్లాక్‌లో మంత్రులు పొంగూరు నారాయణ, వంగలపూడి అనిత, ఆనం రామనారాయణరెడ్డి, పయ్యావుల కేశవ్‌లకు ఛాంబర్లు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఇప్పటికే కొందరు మంత్రులు వారికి కేటాయించిన కార్యాలయాల్లో చేరారు.

జనసేన మంత్రుల ఛాంబర్లన్నీ పక్కపక్కనే: మంత్రి దుర్గేశ్‌

సచివాలయంలో జనసేన మంత్రుల ఛాంబర్లన్నీ పక్కపక్కనే ఉండేలా ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ నిర్ణయించారని పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేశ్‌ వెల్లడించారు. సచివాలయంలో మంగళవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘పవన్‌ కల్యాణ్‌ బుధవారం, నేను గురువారం మంత్రులుగా బాధ్యతలు చేపడతాం’ అని దుర్గేశ్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని