వైకాపా హయాంలో యూపీఎస్సీకి పంపిన జాబితా రద్దు చేయాలి

ఐఏఎస్‌ పదోన్నతుల కోసం వైకాపా ప్రభుత్వ హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్, ప్రతిపాదనలను రద్దు చేయాలని ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాల ఐక్యవేదిక ఛైర్మన్‌ కేఆర్‌ సూర్యనారాయణ, ప్రధాన కార్యదర్శి బాజీ పఠాన్‌ డిమాండ్‌ చేశారు.

Published : 19 Jun 2024 04:56 IST

ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాల ఐక్యవేదిక డిమాండ్‌

ఈనాడు, అమరావతి: ఐఏఎస్‌ పదోన్నతుల కోసం వైకాపా ప్రభుత్వ హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్, ప్రతిపాదనలను రద్దు చేయాలని ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాల ఐక్యవేదిక ఛైర్మన్‌ కేఆర్‌ సూర్యనారాయణ, ప్రధాన కార్యదర్శి బాజీ పఠాన్‌ డిమాండ్‌ చేశారు. ఉద్యోగులందరికీ సమాన అవకాశాలు కల్పించాలని కోరారు. ‘ఐఏఎస్‌ పదోన్నతులకు వైకాపా తాబేదారుల పేర్లను ఎంపిక చేసి, యూపీఎస్సీకి గత ప్రభుత్వం పంపించింది. నిబంధనల మేరకు కనీస అర్హత లేని వారిని ప్రతిపాదించింది. వైకాపా ప్రభుత్వ హయాంలో సీఎంఓలో పని చేసిన ధనుంజయ్‌రెడ్డి వద్ద గుమస్తాగా పని చేసిన నీలకంఠరెడ్డి, అలాగే మరో అనుచరుడు బొమ్మినేని అనిల్‌ కుమార్‌రెడ్డికి గతంలో ఐఏఎస్‌లుగా పదోన్నతి కల్పించారు. నిబంధనలకు విరుద్ధంగా చేసినా ఐఏఎస్‌ అధికారుల సంఘం కిమ్మనలేదు. అదే క్రమంలో ధనుంజయ్‌రెడ్డి వద్ద పని చేసిన మహిళా గుమస్తాకు కూడా ఐఏఎస్‌గా పదోన్నతి కోసం అప్పటి మాజీ సీఎస్‌ జవహర్‌రెడ్డితో కలిసి చేసిన ప్రయత్నం తెలిసిందే. వైకాపా ప్రభుత్వంలో ఐఏఎస్‌ పదోన్నతికి పంపిన జాబితా, నోటిఫికేషన్‌ను రద్దు చేయాలి. గతంలో జరిగిన నీలకంఠరెడ్డి, అనిల్‌కుమార్‌రెడ్డిల పదోన్నతిని సమీక్షించి రద్దు చేయాలి. అర్హులకు దక్కేలా చూడాలి. వైకాపా ప్రభుత్వం గ్రూపు-1 అధికారుల ఆత్మగౌరవానికి భంగం కలిగించేలా వ్యవహరించింది. నీతిమంతమైన అధికారులను పక్కన పెట్టి ఇతర రాష్ట్రాల నుంచి కేంద్ర సర్వీసు ఉద్యోగులను దిగుమతి చేసుకుంది’ అని ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని