ఎట్టకేలకు దేవాదాయ శాఖ అదనపు కమిషనర్‌కు విధుల కేటాయింపు

దేవాదాయ శాఖ అదనపు కమిషనర్‌-2 రామచంద్రమోహన్‌కు ఎట్టకేలకు విభాగం కేటాయించారు. ఉద్యోగుల సర్వీసు అంశాల విభాగం (ఎస్టాబ్లిష్‌మెంట్‌) దస్త్రాలన్నీ ఆయన వద్దకు పంపాలని ఆ శాఖ కమిషనర్‌ సత్యనారాయణ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు.

Published : 19 Jun 2024 06:01 IST

ఈనాడు, అమరావతి: దేవాదాయ శాఖ అదనపు కమిషనర్‌-2 రామచంద్రమోహన్‌కు ఎట్టకేలకు విభాగం కేటాయించారు. ఉద్యోగుల సర్వీసు అంశాల విభాగం (ఎస్టాబ్లిష్‌మెంట్‌) దస్త్రాలన్నీ ఆయన వద్దకు పంపాలని ఆ శాఖ కమిషనర్‌ సత్యనారాయణ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. రామచంద్రమోహన్‌ను పది నెలల కిందట ఉద్దేశపూర్వకంగా కమిషనరేట్‌ నుంచి పంపేశారు. అప్పటి మంత్రి ఒత్తిడితో ఆయన కేడర్‌ కంటే తక్కువ అయిన అన్నవరం ఆలయానికి ఈవోగా బదిలీ చేశారు. ఇది నిబంధనలకు విరుద్ధమని ఆయన హైకోర్టును ఆశ్రయించడంతో కమిషనరేట్‌లో అదనపు కమిషనర్‌ పోస్టులో ఉంటూనే, అన్నవరం ఆలయ ఈవోగా ఇన్‌ఛార్జి బాధ్యతలు చూడాలని ఆదేశాల్లో మార్పు చేశారు. అయితే కమిషనరేట్‌లో ఆయన ఏ దస్త్రాలూ చూడకుండా అన్ని విభాగాలనూ తప్పించారు. ఆయనకు ఛాంబరే లేకుండా చేశారు. ఎన్నికల ఫలితాల తర్వాత కమిషనరేట్‌లో పాత ఛాంబర్‌ను మళ్లీ అందుబాటులోకి తెచ్చారు. నిబంధనల ప్రకారం అదనపు కమిషనర్‌-2 చూడాల్సిన విభాగాల దస్త్రాలన్నీ  రామచంద్రమోహన్‌కు పంపాలని ఐదు రోజుల కిందట ఆదేశాలిచ్చినా అమలు కాలేదు. తాజాగా ఎస్టాబ్లిష్‌మెంట్‌ విభాగం దస్త్రాలను ఆయనకు పంపాలని కమిషనర్‌ ఉత్తర్వులిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని