సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు 17.82 లక్షల టన్నులు

భారత్‌ నుంచి సముద్ర సంపద ఎగుమతులు గరిష్ఠ స్థాయిలో నమోదయ్యాయి. 2023-24 సంవత్సరంలో రూ.60,523.89 కోట్ల విలువైన 17.82 లక్షల టన్నుల మత్స్య ఉత్పత్తులు ఎగుమతి అయ్యాయి.

Published : 19 Jun 2024 06:02 IST

2023-24లో 2.67% వృద్ధి నమోదు
ఎంపెడా ఛైర్మన్‌ స్వామి

ఈనాడు, అమరావతి: భారత్‌ నుంచి సముద్ర సంపద ఎగుమతులు గరిష్ఠ స్థాయిలో నమోదయ్యాయి. 2023-24 సంవత్సరంలో రూ.60,523.89 కోట్ల విలువైన 17.82 లక్షల టన్నుల మత్స్య ఉత్పత్తులు ఎగుమతి అయ్యాయి. పరిమాణం పరంగా 2.67% వృద్ధి నమోదైందని ఎంపెడా ఛైర్మన్‌ డీవీ స్వామి ఓ ప్రకటనలో తెలిపారు. 2022-23 సంవత్సరంతో పోలిస్తే ఎగుమతుల విలువ రూ.3,446 కోట్లు తక్కువగా నమోదైంది. రూ.40,013.54 కోట్ల విలువైన 7.16 లక్షల టన్నుల రొయ్యలు ఎగుమతి చేసినట్లు స్వామి వివరించారు. మొత్తం ఎగుమతుల్లో విలువ పరంగా 66%, పరిమాణం పరంగా 40.19% మేర రొయ్యలు ఉన్నాయి. భారత్‌ నుంచి అమెరికా 2.98 లక్షల టన్నులు, చైనా 1.48 లక్షలు, యూరోపియన్‌ యూనియన్‌ 90 వేలు, దక్షిణాసియా దేశాలు 52 వేలు, జపాన్‌ 36 వేల టన్నుల మేర రొయ్యలు దిగుమతి చేసుకున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో రూ.2,855 కోట్ల విలువైన 39 వేల టన్నుల బ్లాక్‌ టైగర్‌ రొయ్యలు ఎగుమతి అయ్యాయి. 2022-23తో పోలిస్తే 24.91% పెరిగాయి. 28.43% వాటాతో చైనా ప్రధాన దిగుమతిదారుగా నిలిచింది. ఎగుమతుల్లో ఘనీభవించిన చేపల వాటా 21.42% ఉంది. మత్స్య ఉత్పత్తుల్లో భారత్‌ నుంచి ప్రధాన దిగుమతిదారుగా 34.53 శాతంతో అమెరికా తొలి స్థానంలో ఉంది. తర్వాతి స్థానాల్లో చైనా, జపాన్, వియత్నాం, థాయ్‌లాండ్, కెనడా, స్పెయిన్, బెల్జియం నిలిచాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని