వికసిత్‌ భారత్‌లో వ్యవసాయ విద్యార్థుల పాత్ర కీలకం

వికసిత్‌ భారత్‌ లక్ష్య సాధనలో వ్యవసాయ విద్యార్థులు కీలకపాత్ర పోషించాలని రాష్ట్ర గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ ఆకాంక్షించారు.

Published : 20 Jun 2024 04:59 IST

అంగ్రూ స్నాతకోత్సవంలో గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌

విద్యార్థినికి పట్టా అందిస్తున్న గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌. చిత్రంలో ఐసీఏఆర్‌ డీజీ హిమాన్షు పాఠక్, అంగ్రూ వీసీ శారద జయలక్ష్మీదేవి  

బాపట్ల, న్యూస్‌టుడే: వికసిత్‌ భారత్‌ లక్ష్య సాధనలో వ్యవసాయ విద్యార్థులు కీలకపాత్ర పోషించాలని రాష్ట్ర గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ ఆకాంక్షించారు. బాపట్లలోని ఏజీ కళాశాలలో బుధవారం నిర్వహించిన ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం (అంగ్రూ) 56వ స్నాతకోత్సవంలో కులపతి హోదాలో గవర్నర్‌ పాల్గొని ప్రసంగించారు. ప్రపంచ వ్యవసాయ రంగంలో వస్తున్న అనూహ్య మార్పులపై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని సూచించారు. పెరుగుతున్న జనాభా, ప్రతికూల వాతావరణ పరిస్థితులు వ్యవసాయ రంగానికి సరికొత్త సవాళ్లు విసురుతున్నాయన్నారు. వీటిని దీటుగా ఎదుర్కొనేలా కృత్రిమ మేధ, రిమోట్‌ సెన్సింగ్, డ్రోన్‌ టెక్నాలజీ తదితర నూతన సాంకేతికతలపై దృష్టి పెట్టాలన్నారు. పంటల దిగుబడులు పెంచడం ద్వారా రైతు సంక్షేమానికి కృషి చేయాలని పేర్కొన్నారు. అనంతరం కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు పట్టాలు, ఉత్తమ శాస్త్రవేత్తలు, ఉపాధ్యాయ పురస్కారాలు ప్రదానం చేశారు. భారత వ్యవసాయ పరిశోధన మండలి డైరెక్టర్‌ జనరల్‌ డా.హిమాన్షు పాఠక్, విశ్వవిద్యాలయ ఉప కులపతి డా.ఆర్‌.శారద జయలక్ష్మీదేవి, రిజిస్ట్రార్‌ జి.రామచంద్రరావు, ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మ, కళాశాల ఏడీ వి.శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని