తెలంగాణ ఉద్యోగులను రిలీవ్‌ చేయండి

తెలంగాణ రాష్ట్రానికి చెందిన 144 మంది ఉద్యోగులు ఆంధ్రప్రదేశ్‌లో పని చేస్తున్నారని, వారిని తమ రాష్ట్రానికి పంపాలని టీఎన్‌జీఓ సంఘం నేతలు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్‌ను కలిసి విన్నవించారు.

Published : 20 Jun 2024 06:29 IST

ఏపీ సీఎస్‌ను కోరిన టీఎన్‌జీఓ సంఘం

ఏపీ సీఎస్‌ నీరబ్‌కుమార్‌కు పుష్పగుచ్ఛం అందజేస్తున్న టీఎన్‌జీఓ సంఘం అధ్యక్షుడు జగదీశ్వర్, ఇతర నేతలు

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రానికి చెందిన 144 మంది ఉద్యోగులు ఆంధ్రప్రదేశ్‌లో పని చేస్తున్నారని, వారిని తమ రాష్ట్రానికి పంపాలని టీఎన్‌జీఓ సంఘం నేతలు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్‌ను కలిసి విన్నవించారు. బుధవారం అమరావతిలో ఏపీ సీఎస్‌ను మర్యాదపూర్వకంగా సంఘం సభ్యులు కలిశారు. ఈ సందర్భంగా ఉద్యోగుల రిలీవ్‌పై ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఆ రాష్ట్రాన్ని కోరినట్లు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్‌ గుర్తు చేశారు. ఏపీ సీఎస్‌ను కలిసిన వారిలో ప్రధాన కార్యదర్శి ముజీ హుస్సేన్, సహఅధ్యక్షులు కస్తూరి వెంకటేశ్వర్లు, ఎం.సత్యనారాయణగౌడ్, కోశాధికారి రామినేని శ్రీనివాసరావు, హైదరాబాద్‌ నగర అధ్యక్షుడు కట్కూరి శ్రీకాంత్, ఉపాధ్యక్షలు నర్సింహారెడ్డి, కొండల్‌రెడ్డి తదితరులున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని