వ్యవస్థను దోచుకున్నవారిని వదిలిపెట్టం

పౌరసరఫరాల వ్యవస్థను దోచుకున్నవారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ పేర్కొన్నారు.

Published : 20 Jun 2024 06:07 IST

పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌

గొల్లపూడిలోని పౌరసరఫరాల శాఖ గోదాములో సరకులను పరిశీలిస్తున్న మంత్రి నాదెండ్ల మనోహర్‌ 

విజయవాడ (గొల్లపూడి), న్యూస్‌టుడే: పౌరసరఫరాల వ్యవస్థను దోచుకున్నవారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ పేర్కొన్నారు. విజయవాడ గ్రామీణ మండలం గొల్లపూడిలోని పౌరసరఫరాల శాఖ గోదామును మంత్రి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 160 మండల స్థాయి స్టాక్‌ పాయింట్లను పరిశీలించగా 68 చోట్ల సరకులో అవకతవకలు గుర్తించినట్లు తెలిపారు. ఎన్టీఆర్‌ జిల్లా గొల్లపూడిలోని గోదాములో ఆరు సరకుల్లో ఐదు నాణ్యత, సరైన తూకం లేనట్లు గుర్తించినట్లు తెలిపారు. పౌరసరఫరాల శాఖలో గోదాముల వద్ద సరకుల వివరాలు నమోదు చేయలేని పరిస్థితి ఉందని, దీనికి కారణమైన అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. గోదాములోని సరకుల తూకంలో తేడాలున్నా ఎందుకు సరిచూసుకోలేదంటూ అక్కడున్న అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని