దివ్యాంగుల బ్యాక్‌లాగ్‌ పోస్టుల్ని వెంటనే భర్తీ చేయండి

రాష్ట్రవ్యాప్తంగా దివ్యాంగుల కోసం రిజర్వ్‌ చేసిన బ్యాక్‌లాగ్‌ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని అధికారులను దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజయనేయస్వామి ఆదేశించారు.

Published : 21 Jun 2024 03:40 IST

మంత్రి డీబీవీ స్వామి ఆదేశం

ఈనాడు, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా దివ్యాంగుల కోసం రిజర్వ్‌ చేసిన బ్యాక్‌లాగ్‌ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని అధికారులను దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజయనేయస్వామి ఆదేశించారు. ఆసుపత్రుల్లో వృద్ధుల కోసం వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. సచివాలయంలో గురువారం ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. ‘దివ్యాంగుల సమస్యలను పరిష్కరించడానికి కలెక్టర్ల నేతృత్వంలోని జిల్లా స్థాయి దివ్యాంగ కమిటీలు మూడు నెలలకొకసారి తప్పనిసరిగా సమావేశాలు నిర్వహించాలి. దానికి అనుగుణంగా రాష్ట్ర సలహామండలి క్రమం తప్పకుండా సమావేశమవ్వాలి. ప్రభుత్వ సంస్థల్లోని ఉద్యోగాల్లో 4%, ఉన్నత విద్యాసంస్థల్లో 5% సీట్లు దివ్యాంగులకు కేటాయిస్తున్నారా? లేదా వివరాలు సేకరించాలి. హిజ్రాల జీవనోపాధికి స్వయం సహాయక బృందాల ఏర్పాటును ప్రోత్సహించాలి. వారి కోసం కేంద్ర ప్రభుత్వ సహకారంతో వసతి గృహం ఏర్పాటు చేయాలి’ అని ఆదేశించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని