చెత్త వాహనం.. వైకాపా నేత పరం!

స్వచ్ఛ సంకల్పం పేరుతో గ్రామ పంచాయతీల్లో తడి, పొడి చెత్త సేకరించేలా గత వైకాపా ప్రభుత్వం ఇచ్చిన వాహనాలను  కొంతమంది నాయకులు తమ సొంత వ్యాపారాలకు వాడుకుంటున్నారు.

Published : 21 Jun 2024 03:41 IST

వైకాపా నేత రైస్‌ మిల్లు వద్ద ఉన్న వాహనం

సీతానగరం, న్యూస్‌టుడే: స్వచ్ఛ సంకల్పం పేరుతో గ్రామ పంచాయతీల్లో తడి, పొడి చెత్త సేకరించేలా గత వైకాపా ప్రభుత్వం ఇచ్చిన వాహనాలను  కొంతమంది నాయకులు తమ సొంత వ్యాపారాలకు వాడుకుంటున్నారు. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం పురుషోత్తపట్నం గ్రామ పంచాయతీకి సుమారు రూ.7 లక్షల విలువైన వాహనాన్ని ఇచ్చారు. పంచాయతీ పాలన పగ్గాలు వైకాపా నేతల చేతిలో ఉండడంతో, వైకాపా జడ్పీటీసీ సభ్యురాలు వెంకటలక్ష్మి భర్త సుజీరాజు ఆ వాహనాన్ని ధాన్యం బస్తాలు రవాణా చేసేందుకు వీలుగా మార్చుకున్నారు. రామచంద్రపురంలోని తన సొంత రైస్‌ మిల్లులో పెట్టి ధాన్యం, బియ్యం బస్తాల రవాణాకు వాడుకుంటున్నారు. ప్రజలు నిలదీసినా ఆయన పట్టించుకోలేదు. అధికారులూ దాన్ని తిరిగి తీసుకురాలేకపోయారు. దీనిపై గురువారం తెదేపా, జనసేన నాయకులు, ప్రజలు ఆందోళన చేశారు. ఆ వాహనాన్ని ప్రజా అవసరాలకు వాడాలని పంచాయతీ కార్యదర్శికి వినతి పత్రం ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని