నాలుగున్నరేళ్లుగా సస్పెన్షన్‌లోనే డీఎస్పీ.. ఊరట కలిగించిన ఎన్డీయే సర్కార్‌

వైకాపా ప్రభుత్వం ఓ డీఎస్పీని ఉద్దేశపూర్వకంగా నాలుగున్నరేళ్ల పాటు సస్పెన్షన్‌లో ఉంచింది. అంతకుముందు ఆరు నెలలు ఎలాంటి పోస్టింగ్‌ ఇవ్వకుండా వీఆర్‌లో పెట్టింది.

Published : 21 Jun 2024 03:41 IST

ఈనాడు, అమరావతి: వైకాపా ప్రభుత్వం ఓ డీఎస్పీని ఉద్దేశపూర్వకంగా నాలుగున్నరేళ్ల పాటు సస్పెన్షన్‌లో ఉంచింది. అంతకుముందు ఆరు నెలలు ఎలాంటి పోస్టింగ్‌ ఇవ్వకుండా వీఆర్‌లో పెట్టింది. ఇదీ గుంటూరుకు చెందిన గోగినేని రామాంజనేయులు 2015 నుంచి 2018 వరకు గుంటూరు నార్త్‌ సబ్‌డివిజన్‌ డీఎస్పీగా పనిచేశారు. ఆ సమయంలో వైకాపాకు చెందిన ఆళ్ల రామకృష్ణారెడ్డి అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2019 ఎన్నికల్లో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆళ్ల సదరు డీఎస్పీపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం ఆయనపై సామాజికవర్గం ముద్ర వేసి పోస్టింగ్‌ ఇవ్వకుండా పక్కన పెట్టేయడంతో పాటు అవినీతి ఆరోపణల పేరుతో సీఐడీ విచారణకు ఆదేశించింది. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ అప్పటి గుంటూరు ఎస్పీ నివేదిక ఇవ్వడంతో సస్పెండ్‌ చేసింది. సామాజికవర్గం కారణంగానే లేనిపోని నిందారోపణలతో వైకాపా ప్రభుత్వం ఆయనను సస్పెండ్‌ చేసి ఇబ్బంది పెట్టిందని పోలీసు శాఖలోనే ప్రచారంలో ఉంది. ఇప్పుడు ఎన్డీయే ప్రభుత్వం రావడంతో ఆయనకు ఊరట కలిగింది. మానసికంగా, ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతున్న రామాంజనేయులుపై సస్పెన్షన్‌ ఎత్తివేసి డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎట్టకేలకు పోస్టింగ్‌ రావడంతో రామాంజనేయులు ప్రభుత్వానికి, సీఎం, డీజీపికి కృతజ్ఞతలు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని