బాలకృష్ణకు అభినందనల వెల్లువ

హిందూపురం ఎమ్మెల్యేగా మూడోసారి ఎన్నికైన నందమూరి బాలకృష్ణను సినీ ప్రముఖులు దిల్‌రాజు, కె.ఎల్‌.దామోదర్‌ప్రసాద్, టి.ప్రసన్నకుమార్, అనుపమ్‌ రెడ్డి, మాదాల రవి గురువారం హైదరాబాద్‌లో కలిసి అభినందనలు తెలిపారు.

Published : 21 Jun 2024 05:22 IST

బాలకృష్ణకు పుష్పగుచ్ఛం అందిస్తున్న సినీ ప్రముఖులు కె.ఎల్‌.దామోదర్‌ ప్రసాద్, దిల్‌రాజు, టి.ప్రసన్నకుమార్‌

ఈనాడు, హైదరాబాద్‌: హిందూపురం ఎమ్మెల్యేగా మూడోసారి ఎన్నికైన నందమూరి బాలకృష్ణను సినీ ప్రముఖులు దిల్‌రాజు, కె.ఎల్‌.దామోదర్‌ప్రసాద్, టి.ప్రసన్నకుమార్, అనుపమ్‌ రెడ్డి, మాదాల రవి గురువారం హైదరాబాద్‌లో కలిసి అభినందనలు తెలిపారు. తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి, తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి, తెలంగాణ రాష్ట్ర చలన చిత్ర వాణిజ్య మండలి, మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ తరఫున బాలకృష్ణను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ‘ఈ నెల 26న తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి కార్యవర్గ సమావేశం విజయవాడలో నిర్వహిస్తాం. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్, మంత్రులు నారా లోకేశ్, కందుల దుర్గేశ్‌లను కలుస్తాం’ అని నిర్మాతలు దిల్‌రాజు, కె.ఎల్‌.దామోదర్‌ ప్రసాద్, కె.శివప్రసాదరావు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని