రబీ కరవు నష్టానికి రూ.319.77 కోట్లు ఇవ్వండి

గడచిన రబీలో ఏర్పడ్డ కరవుకు నష్టపరిహారంగా రూ.319.77 కోట్ల సాయం అందించాలని రాష్ట్ర విపత్తులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్‌ కేంద్ర బృందాన్ని కోరారు. పీఎంఎఫ్‌బీవై సీఈఓ రితేష్‌ చౌహాన్‌ ఆధ్వర్యంలోని కేంద్రం బృందం రాష్ట్రంలో కరవు ప్రాంతాలను పరిశీలించింది.

Published : 22 Jun 2024 05:03 IST

కేంద్ర బృందానికి రాష్ట్ర ప్రభుత్వ వినతి

ఈనాడు, అమరావతి: గడచిన రబీలో ఏర్పడ్డ కరవుకు నష్టపరిహారంగా రూ.319.77 కోట్ల సాయం అందించాలని రాష్ట్ర విపత్తులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్‌ కేంద్ర బృందాన్ని కోరారు. పీఎంఎఫ్‌బీవై సీఈఓ రితేష్‌ చౌహాన్‌ ఆధ్వర్యంలోని కేంద్రం బృందం రాష్ట్రంలో కరవు ప్రాంతాలను పరిశీలించింది. అనంతరం విపత్తుల నిర్వహణ సంస్థ ఉన్నతాధికారులతో భేటీ అయింది. ఈ సందర్భంగా రబీలో కరవు పరిస్థితులపై అజయ్‌జైన్‌ పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు. 6 జిల్లాల పరిధిలో 87 మండలాల్లో కరవు పరిస్థితులున్నాయని వివరించారు. క్షేత్రస్థాయిలో కరవును పరిగణనలోకి తీసుకుని సాయం అందించాలని.. ఉపాధి హామీ పథకం కింద అదనంగా 50 రోజులు పని కల్పించాలని కోరారు. కరవు నష్టంపై కేంద్రానికి నివేదిక ఇస్తామని రితేష్‌ చౌహాన్‌ వారికి హామీ ఇచ్చారు. పంటలు నష్టపోయిన రైతులకు సాయం అందేలా చూస్తామన్నారు. ఖరీఫ్‌ సాగు మొదలైన నేపథ్యంలో వెంటనే సాయం అందించేలా చూడాలని వ్యవసాయశాఖ ప్రత్యేక కమిషనర్‌ హరికిరణ్‌ కోరారు. సమావేశంలో విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్, పునరావాస, రీసెటిల్మెంట్‌ కమిషనర్‌ డాక్టర్‌ సి.శ్రీధర్, పశుసంవర్ధకశాఖ డైరెక్టర్‌ అమరేంద్రకుమార్, పంచాయతీరాజ్‌శాఖ కమిషనర్‌ శివప్రసాద్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని