యోగాతో మానసిక ఒత్తిడి దూరం

రోజూ కొద్ది సమయం యోగా చేస్తే మానసిక ఒత్తిడి దూరమవుతుందని, ఆరోగ్యకరంగా ఉంటామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ అన్నారు.

Published : 22 Jun 2024 05:04 IST

వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్

ధ్యానం చేస్తున్న మంత్రి సత్యకుమార్‌ యాదవ్, ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్‌ తదితరులు

విజయవాడ సిటీ (మొగల్రాజపురం), న్యూస్‌టుడే: రోజూ కొద్ది సమయం యోగా చేస్తే మానసిక ఒత్తిడి దూరమవుతుందని, ఆరోగ్యకరంగా ఉంటామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శుక్రవారం విజయవాడ ఎ ప్లస్‌ కన్వెన్షన్‌లో రాష్ట్ర ఆయుష్‌ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. భారతీయ విశిష్ట సంపద అయిన యోగాను ప్రధాని నరేంద్ర మోదీ విశ్వవ్యాప్తం చేశారన్నారు. పిల్లలకు చిన్నప్పటి నుంచే యోగా, ధ్యానం అలవరచాలని తల్లిదండ్రులను కోరారు. అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, తిరువూరు, ఎచ్చెర్ల ఎమ్మెల్యేలు కొలికపూడి శ్రీనివాసరావు, ఎన్‌.ఈశ్వరరావు, వైద్య, ఆరోగ్య, ఆయుష్‌ శాఖల ఉన్నతాధికారులు కృష్ణబాబు, వెంకటేశ్వర్, రాజేంద్రకుమార్, జి.లక్ష్మీశ తదితరులు పాల్గొన్నారు. ప్రకృతి వైద్యుడు మంతెన సత్యనారాయణరాజు సారథ్యంలో ఆసనాలు వేశారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని