నిబంధనలు పాటించాలి

గుంటూరు జిల్లా తాడేపల్లిలో నిర్మిస్తున్న వైకాపా కార్యాలయం కూల్చివేత విషయంలో చట్ట నిబంధనలను పాటించాలని సీఆర్‌డీఏకు హైకోర్టు స్పష్టం చేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ చీమలపాటి రవి శుక్రవారం ఈమేరకు ఉత్తర్వులిచ్చారు.

Published : 22 Jun 2024 05:07 IST

వైకాపా కార్యాలయం విషయంలో సీఆర్‌డీఏకు హైకోర్టు స్పష్టీకరణ

ఈనాడు, అమరావతి: గుంటూరు జిల్లా తాడేపల్లిలో నిర్మిస్తున్న వైకాపా కార్యాలయం కూల్చివేత విషయంలో చట్ట నిబంధనలను పాటించాలని సీఆర్‌డీఏకు హైకోర్టు స్పష్టం చేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ చీమలపాటి రవి శుక్రవారం ఈమేరకు ఉత్తర్వులిచ్చారు. తమ కార్యాలయం కూల్చివేతకు సీఆర్‌డీఏ యత్నిస్తోందంటూ వైకాపా హైకోర్టులో శుక్రవారం అత్యవసరంగా పిటిషన్‌ వేసింది. పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. తుది ఉత్తర్వులివ్వకుండా కూల్చివేతకు చర్యలు చేపడుతున్నారని అన్నారు. ఈ వ్యాజ్యంపై విచారించిన న్యాయమూర్తి.. చట్ట నిబంధనల మేరకు నడుచుకోవాలని సీఆర్‌డీఏకు స్పష్టం చేస్తూ వ్యాజ్యాన్ని పరిష్కరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని