గనులశాఖ ముఖ్య కార్యదర్శిగా ద్వివేది తొలగింపు

జగన్‌ ప్రభుత్వంలో వీర విధేయ అధికారిగా వ్యవహరించిన గోపాలకృష్ణ ద్వివేదిని ప్రభుత్వం.. గనుల శాఖ నుంచి తప్పించింది. పరిశ్రమలు, వాణిజ్యశాఖ కార్యదర్శిగా ఉన్న ఎన్‌.యువరాజ్‌కు గనులశాఖను అప్పగించింది.

Published : 22 Jun 2024 05:07 IST

విమర్శల నేపథ్యంలో చర్యలు తీసుకున్న ప్రభుత్వం 

ఈనాడు, అమరావతి: జగన్‌ ప్రభుత్వంలో వీర విధేయ అధికారిగా వ్యవహరించిన గోపాలకృష్ణ ద్వివేదిని ప్రభుత్వం.. గనుల శాఖ నుంచి తప్పించింది. పరిశ్రమలు, వాణిజ్యశాఖ కార్యదర్శిగా ఉన్న ఎన్‌.యువరాజ్‌కు గనులశాఖను అప్పగించింది. వ్యవసాయ, పశుసంవర్ధకశాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్న గోపాలకృష్ణ ద్వివేదిని కార్మిక, కర్మాగారాలు, బాయిలర్ల శాఖ కార్యదర్శిగా ప్రభుత్వం బదిలీ చేసింది. గనులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగానూ ఆయన అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నా.. ఆ పోస్టును అలాగే కొనసాగించింది. దీనిపై సామాజిక మాధ్యమాల్లో పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. తనను కింద కూర్చోబెట్టిన అధికారికి చంద్రబాబు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో గనులశాఖ నుంచి ద్వివేదిని రిలీవ్‌ చేశారు. 

ఏపీ అమూల్‌ ప్రాజెక్టు ప్రత్యేకాధికారిగా ఎంఎం నాయక్‌

ఆంధ్రప్రదేశ్‌ పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య(ఏపీడీడీసీఎఫ్‌) ఎండీ, ఏపీ అమూల్‌ ప్రాజెక్టు ప్రత్యేక అధికారిగా పశు సంవర్ధకశాఖ కార్యదర్శి ఎంఎం నాయక్‌ను అదనపు బాధ్యతలపై నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఇప్పటి వరకు అక్కడ అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న ఎ.బాబును రిలీవ్‌ చేసింది.

ఇంటర్మీడియట్‌ విద్య కమిషనర్‌గా నిధి మీనా

ఇంటర్మీడియట్‌ విద్య కమిషనర్‌గా వయోజన విద్య డైరెక్టర్‌ నిధి మీనాకు అదనపు బాధ్యతలు అప్పగించారు. పాఠశాలల మౌలిక వసతుల శాఖ కమిషనర్‌గా సర్వశిక్ష అభియాన్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ బి.శ్రీనివాసరావుకు అదనపు బాధ్యతలు ఇస్తూ సీఎస్‌ ఉత్తర్వులు ఇచ్చారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని