ఇది జీవితంలో మరపురాని ఘట్టం: మంత్రి నారా లోకేశ్‌

మంగళగిరి నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో ఎమ్మెల్యేగా ప్రమాణం చేయడం జీవితంలో మరపురాని ఘట్టం అని మంత్రి నారా లోకేశ్‌ పేర్కొన్నారు.

Published : 22 Jun 2024 05:17 IST

మంగళగిరి, న్యూస్‌టుడే: మంగళగిరి నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో ఎమ్మెల్యేగా ప్రమాణం చేయడం జీవితంలో మరపురాని ఘట్టం అని మంత్రి నారా లోకేశ్‌ పేర్కొన్నారు. అయిదేళ్ల కిందట ఓడిన చోటే రికార్డు స్థాయి మెజారిటీతో గెలిపించి అసెంబ్లీకి పంపిన ఈ నియోజకవర్గ ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానని, కూటమి నేతృత్వంలో కొలువైన ప్రజా ప్రభుత్వం 5 కోట్ల మంది ఆశలు, ఆకాంక్షల మేరకు పనిచేస్తుందని తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. మంగళగిరి నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికైన తాను ఈ రోజు గౌరవసభలో ప్రమాణం చేశానని పేర్కొంటూ ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసిన వీడియోనూ ‘ఎక్స్‌’లో లోకేశ్‌ పోస్టు చేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు