‘విదేశీ విద్య’కు ఏపీజే అబ్దుల్‌కలాం పేరు

విదేశీ విద్య పథకానికి పూర్వ రాష్ట్రపతి, శాస్త్రవేత్త ఏపీజే అబ్దుల్‌కలాం పేరు పెట్టాలని నిర్ణయించినట్లు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ తెలిపారు.

Published : 22 Jun 2024 05:19 IST

మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ వెల్లడి

మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్న ఎన్‌ఎండీ ఫరూక్‌

ఈనాడు డిజిటల్, అమరావతి: విదేశీ విద్య పథకానికి పూర్వ రాష్ట్రపతి, శాస్త్రవేత్త ఏపీజే అబ్దుల్‌కలాం పేరు పెట్టాలని నిర్ణయించినట్లు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ తెలిపారు. ప్రధానమంత్రి జన్‌వికాస్‌(పీఎంజేవీకే) కార్యక్రమం కింద 2014-2019 మధ్య మంజూరైన రూ.643.54 కోట్ల విలువైన 77 ప్రాజెక్టుల్ని త్వరితగతిన పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. వీటిని గత వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని దుయ్యబట్టారు.  అందుకు సంబంధించిన నిధుల విడుదలకు చర్యలు చేపట్టాలని ఆర్థికశాఖ అధికారుల్ని ఆదేశించినట్లు తెలిపారు. రాష్ట్ర సచివాలయంలోని మూడో బ్లాక్‌లో శుక్రవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. ప్రత్యేకంగా నమాజ్‌ చేశారు. అనంతరం విలేకర్లతో మాట్లాడారు. ‘‘వక్ఫ్‌ బోర్డుకు ఉన్న విలువైన ఆస్తుల్ని కాపాడతాం. హజ్‌ యాత్రికుల కోసం మెరుగైన సౌకర్యాలు కల్పిస్తాం. గత ప్రభుత్వం మైనారిటీలకు ద్రోహం చేసింది. అనేక సంక్షేమ పథకాల్ని రద్దు చేసింది. వివిధ పథకాలకు మహనీయుల పేరు తొలగించి జగన్‌ తన పేరు పెట్టుకొన్నారు’’ అని ఫరూక్‌ మండిపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని