పోలీసింగ్‌లో స్పష్టమైన మార్పు కనిపించాలి

‘‘త్వరలోనే పోలీసు యంత్రాంగం మొత్తాన్ని ప్రక్షాళన చేస్తాం. పోలీసింగ్‌లో స్పష్టమైన మార్పు కనిపించాలి. శాంతిభద్రతల పరిరక్షణ, మహిళల రక్షణకు అగ్ర ప్రాధాన్యమివ్వాలి’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. డీజీపీ సీహెచ్‌.ద్వారకా తిరుమలరావును ఆదేశించారు.

Published : 22 Jun 2024 05:20 IST

డీజీపీకి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం

ఈనాడు, అమరావతి: ‘‘త్వరలోనే పోలీసు యంత్రాంగం మొత్తాన్ని ప్రక్షాళన చేస్తాం. పోలీసింగ్‌లో స్పష్టమైన మార్పు కనిపించాలి. శాంతిభద్రతల పరిరక్షణ, మహిళల రక్షణకు అగ్ర ప్రాధాన్యమివ్వాలి’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. డీజీపీ సీహెచ్‌.ద్వారకా తిరుమలరావును ఆదేశించారు. బాపట్ల జిల్లా ఈపూరుపాలెంలో యువతి అనుమానాస్పద మృతి ఘటనపై డీజీపీ నుంచి ప్రాథమిక వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కేసులో దోషులకు కఠిన శిక్షపడేలా ఆధారాలు సేకరించాలని ఆదేశించారు. వెంటనే ఘటనా స్థలానికి వెళ్లి, బాధిత కుటుంబానికి భరోసా కల్పించాలని హోంమంత్రి వంగలపూడి అనితను చంద్రబాబు ఆదేశించారు. ప్రభుత్వం తరఫున ఆమె కుటుంబానికి అండగా నిలవాలని చెప్పారు. దోషుల్ని తక్షణమే అరెస్టు చేసి వేగవంతంగా దర్యాప్తు చేసి కఠిన శిక్ష పడేలా చూడాలన్నారు. సీఎం ఆదేశాలతో హోంమంత్రి అనిత ఈపూరుపాలెం వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని