రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో 27న రామోజీరావు సంస్మరణ సభ

రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు సంస్మరణ సభను ఈ నెల 27న నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఈ విషయాన్ని శాసనసభ లాబీల్లో శుక్రవారం విలేకరులకు చెప్పారు.

Published : 22 Jun 2024 05:21 IST

ఈనాడు, అమరావతి: రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు సంస్మరణ సభను ఈ నెల 27న నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఈ విషయాన్ని శాసనసభ లాబీల్లో శుక్రవారం విలేకరులకు చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ అంశంపై చర్చించారని పేర్కొన్నారు. విజయవాడ నగర శివారులోని అనుమోలు గార్డెన్స్‌లో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. గతంలో ఎన్టీఆర్‌ శతజయంతి కార్యక్రమం ఈ మైదానంలోనే ఏర్పాటు చేశారు. ఇందుకు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని