గవర్నర్‌ ముఖ్య కార్యదర్శిగా హరిజవహర్‌లాల్‌

గవర్నర్‌ ముఖ్య కార్యదర్శిగా హరిజవహర్‌లాల్‌ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చింది. కార్మిక, కర్మాగారాలు, బాయిలర్ల శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన ఆయన్ని ప్రభుత్వం రెండు రోజుల కిందట బదిలీ చేసి..

Published : 22 Jun 2024 05:22 IST

ఈనాడు, అమరావతి: గవర్నర్‌ ముఖ్య కార్యదర్శిగా హరిజవహర్‌లాల్‌ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చింది. కార్మిక, కర్మాగారాలు, బాయిలర్ల శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన ఆయన్ని ప్రభుత్వం రెండు రోజుల కిందట బదిలీ చేసి.. తాజాగా పోస్టింగ్‌ ఇచ్చింది. 2012 బ్యాచ్‌కు చెందిన ఆయన సంయుక్త కలెక్టర్‌గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నల్గొండ, విభజన తర్వాత ప్రకాశం జిల్లాల్లో పనిచేశారు. వ్యవసాయశాఖ ప్రత్యేక కమిషనర్, విజయనగరం జిల్లా కలెక్టర్, ఆర్‌అండ్‌ఆర్‌ కమిషనర్, సీసీఎల్‌ఏ సంయుక్త కార్యదర్శిగా, దేవాదాయశాఖ కమిషనర్‌గా వ్యవహరించారు. ఇప్పటివరకు గవర్నర్‌ ముఖ్య కార్యదర్శిగా ఉన్న అనిల్‌కుమార్‌ సింఘాల్‌ పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బదిలీ అయ్యారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని