40 వేల కొత్త వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లు

రాష్ట్రంలో కొత్తగా 40,336 వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లు మంజూరు చేయనున్నట్లు రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ పేర్కొన్నారు.

Updated : 23 Jun 2024 06:41 IST

దస్త్రంపై తొలి సంతకం చేసిన మంత్రి గొట్టిపాటి

ఇంధన శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్న గొట్టిపాటి రవికుమార్‌. చిత్రంలో కుటుంబసభ్యులు, అధికారులు

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో కొత్తగా 40,336 వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లు మంజూరు చేయనున్నట్లు రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ పేర్కొన్నారు. రాష్ట్ర సచివాలయంలోని మూడోబ్లాక్‌లో మంత్రిగా శనివారం బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘‘రాష్ట్రంలో రైతులకు ఉచిత విద్యుత్‌ అందించే పథకానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. గత కొన్ని నెలలుగా విద్యుత్‌ కనెక్షన్‌ కోసం రైతులు చేసుకున్న దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. వాటిని వెంటనే మంజూరు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశాం. కేంద్రం ప్రకటించిన పీఎం సూర్య ఘర్‌ ముఫ్త్‌ బిజిలీ యోజన పథకాన్ని సమర్థంగా రాష్ట్రంలో అమలు చేసేలా నిర్ణయం తీసుకున్నాం. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థలకు సంబంధించిన విద్యుత్‌ బిల్లులు భారీగా పెండింగ్‌లో ఉన్నాయి. వాటికి కూడా రూఫ్‌టాప్‌ విద్యుత్‌ వినియోగించేలా దశల వారీగా పనులు చేపట్టాలని భావిస్తున్నాం. దీనికోసం జెన్‌కో ఎండీ చక్రధరబాబు నేతృత్వంలో ఒక కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఆ కమిటీ నివేదిక ఆధారంగా ప్రభుత్వ కార్యాలయాలపై ఏర్పాటు చేసే సౌర విద్యుత్‌ ఫలకాల ద్వారా ఎంత విద్యుత్‌ ఉత్పత్తి అయ్యే అవకాశం ఉందనేది అంచనా వేస్తాం’’ అని పేర్కొన్నారు. ఈ మూడు అంశాలకు సంబంధించిన దస్త్రాలపై ఆయన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సంతకాలు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని