పరిశ్రమల నుంచి వెలువడే కాలుష్యం ఎంత?

పరిశ్రమల నుంచి ఎంత మేర కాలుష్యం వెలువడుతోందో తేల్చాలని అటవీశాఖ, కాలుష్య నియంత్రణ మండలి అధికారులను ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్‌కల్యాణ్‌ ఆదేశించారు.

Updated : 23 Jun 2024 06:38 IST

ఆడిట్‌ నిర్వహించి నివేదిక ఇవ్వండి
ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ ఆదేశం

ఈనాడు, అమరావతి: పరిశ్రమల నుంచి ఎంత మేర కాలుష్యం వెలువడుతోందో తేల్చాలని అటవీశాఖ, కాలుష్య నియంత్రణ మండలి అధికారులను ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్‌కల్యాణ్‌ ఆదేశించారు. అందుకోసం ప్రత్యేక డ్రైవ్, ఆడిట్‌ నిర్వహించి నివేదిక ఇవ్వాలని పేర్కొన్నారు. కృష్ణా, గోదావరి నదీ జలాల కాలుష్యంపై ప్రత్యేకంగా సమీక్షిస్తామని తెలిపారు. శనివారం తన నివాసంలో ఆటవీశాఖ అధికారులతో ఎర్రచందనం అక్రమ రవాణా, పర్యావరణ సంబంధ అంశాలపై పవన్‌కల్యాణ్‌ చర్చించారు. ప్రతి జిల్లాలో కాలుష్య గణాంకాలు చేపట్టాలని, జల, వాయు, కాలుష్య వివరాలను అందజేయాలని అధికారులను ఆదేశించారు. కాగితం, ఇతర పరిశ్రమల నుంచి వెలువడుతున్న కాలుష్యం.. కృష్ణా, గోదావరి నదీ తీరాలపై పడుతున్న ప్రభావంపై అధికారులతో చర్చించారు. వాటి శుద్ధీకరణపై దృష్టిపెట్టాలన్నారు.

ఎర్రచందనం స్మగ్లింగ్‌పై చర్చ: ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టేందుకు టాస్క్‌ఫోర్స్‌ను బలోపేతం చేస్తామని పవన్‌ స్పష్టం చేశారు. ఏపీ నుంచి స్మగ్లర్లు అక్రమంగా తరలించిన 172 టన్నుల ఎర్రచందనం నేపాల్‌లో పట్టుబడిందని అధికారులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఆ సరకును వెనక్కి తెచ్చేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఉపముఖ్యమంత్రి సూచించారు. దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఎక్కడెక్కడ ఎర్రచందనం పట్టుబడిందో తెలియజేయాలని ఆదేశించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు