పీఎం సూర్య ఘర్‌ అమలుకు కమిటీ

పీఎం సూర్య ఘర్‌ పథకం అమలుకు రాష్ట్ర స్థాయి సమన్వయ కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Published : 23 Jun 2024 05:47 IST

ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

ఈనాడు, అమరావతి: పీఎం సూర్య ఘర్‌ పథకం అమలుకు రాష్ట్ర స్థాయి సమన్వయ కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పథకం అమలును ఈ కమిటీ తరచూ సమీక్షించి వివిధ శాఖల మధ్య సమన్వయం చేస్తుంది. ప్రభుత్వ కార్యాలయాలపై సౌర ఫలకాలను ఏర్పాటు చేసేందుకు, నిర్దేశిత వ్యవధిలో లక్ష్యం చేరుకునేలా నిరంతరం సమీక్షిస్తుంది. వివిధ ప్రభుత్వ పథకాల్లో లబ్ధిదారులుగా ఉన్న వారికి రూఫ్‌టాప్‌ సోలార్‌ ప్యానళ్ల ఏర్పాటుపై అవగాహన కల్పిస్తుంది. జిల్లా స్థాయిలో పథకం అమలు పర్యవేక్షణకు కలెక్టర్‌ ఛైర్మన్‌గా కమిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకానికి స్టేట్‌ ఇంప్లిమెంటేషన్‌ ఏజెన్సీగా నెడ్‌క్యాప్‌ వ్యవహరించనుంది.

సమన్వయ కమిటీ ఛైర్మన్‌గా సీఎస్‌: రాష్ట్ర స్థాయిలో సమన్వయ కమిటీ ఛైర్మన్‌గా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) వ్యవహరిస్తారు. సభ్యులుగా ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శితో పాటు గృహ, రెవెన్యూ, మున్సిపల్, పంచాయతీరాజ్‌ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ఉన్నత, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి, రవాణా శాఖ కార్యదర్శి, డిస్కంల సీఎండీలు, పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (నెడ్‌క్యాప్‌) వీసీఎండీ, ఏపీ సోలార్‌ పవర్‌ కార్పొరేషన్‌ ఎండీ, రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ ఛైర్మన్‌ సభ్యులుగా ఉంటారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని