స్వాములకు ఇచ్చిన భూములు స్వాధీనం చేసుకోవాలి

ప్రభుత్వ భూముల్లో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన వైకాపా కార్యాలయాలను కూల్చివేయడం అభినందనీయమని హేతువాద సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నార్నె వెంకట సుబ్బయ్య అన్నారు.

Published : 24 Jun 2024 03:39 IST

హేతువాద సంఘం డిమాండ్‌

మాట్లాడుతున్న వెంకటసుబ్బయ్య తదితరులు

విజయవాడ(గాంధీనగర్‌), న్యూస్‌టుడే: ప్రభుత్వ భూముల్లో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన వైకాపా కార్యాలయాలను కూల్చివేయడం అభినందనీయమని హేతువాద సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నార్నె వెంకట సుబ్బయ్య అన్నారు. అలాగే దొంగస్వాములకు ఇచ్చిన భూములను కూడా స్వాధీనం చేసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆదివారం విజయవాడ ప్రెస్‌ క్లబ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరు మండలంలో కోట్ల విలువ చేసే అటవీ భూములను ఆక్రమించి.. ఆశ్రమం పేరుతో ప్రజలను ఓ బాబా మోసం చేస్తున్నారు. సదరు భూమిని స్వాధీనం చేసుకోవాలని లోకాయుక్త ఆదేశాలు ఇచ్చినా అతీగతీలేదు. స్వరూపానంద స్వామి నిన్నటి వరకు జగన్‌ భజన చేసి.. నేడు చంద్రబాబుకు భజన చేయడం మొదలు పెట్టారు. వైకాపా ప్రభుత్వం స్వరూపానందకు 6 ఎకరాల భూమిని కేటాయిస్తూ ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి. తిరుపతిలో కల్కి అనే దొంగస్వామి దళితులకు చెందిన భూమిని ఆక్రమించి ఆశ్రమం పేరుతో మోసం చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించి రాష్ట్రంలో బాబాలు, స్వాములకు ఇచ్చిన భూములను స్వాధీనం చేసుకోవాలి’ అని కోరారు. సంఘం కార్యవర్గ సభ్యులు ఎం.లక్ష్మీనారాయణ, రజాక్, చంద్రశేఖర్, రాజా తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు