జీఓ 117ను రద్దు చేయాలి.. తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం

విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ 117ను రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం(టీఎన్‌యూఎస్‌) కోరింది.

Published : 24 Jun 2024 03:40 IST

ఈనాడు డిజిటల్, అమరావతి: విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ 117ను రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం(టీఎన్‌యూఎస్‌) కోరింది. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో టీఎన్‌యూఎస్‌ రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ అధ్యక్షుడు మన్నం శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. జీఓ 117 వల్ల ప్రాథమిక పాఠశాలలు.. ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మిగిలాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులకు బోధనేతర పనులు అప్పగించకూడదని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీరామశెట్టి వెంకటేశ్వర్లు, ఉమ్మడి జిల్లాల ప్రతినిధులు హాజరయ్యారు. 

తెలుగునాడు మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు టీఎన్‌టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు రఘురామరాజు తెలిపారు. రాష్ట్ర అధ్యక్షుడిగా కర్నూలు జిల్లాకు చెందిన నాగరాజు, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా గుంటూరు జిల్లాకు చెందిన భానుమూర్తి, ప్రధానకార్యదర్శిగా విశాఖ జిల్లాకు చెందిన బి.శ్రీనివాసాచార్యుల్ని ఎన్నుకున్నట్లు వెల్లడించారు. వీరితోపాటు జిల్లాలకు ప్రాధాన్యం ఇచ్చేలా నలుగుర్ని ప్రధాన ఉపాధ్యక్షులు, తొమ్మిది మంది చొప్పున ఉపాధ్యక్షులు, సంయుక్త ప్రధానకార్యదర్శుల్ని నియమించినట్లు ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు