వేళ్లూనుకున్న నిర్లక్ష్యాన్ని వేర్లతో సహా పెకలించాలి!

Published : 24 Jun 2024 03:44 IST

ఏలూరులోని టిడ్కో గృహ సముదాయాల దుస్థితి

వైకాపా ఐదేళ్ల ఏలుబడిలో పేదల ఇంటి కల చెదిరిపోయింది. ఏలూరులో చేపట్టిన టిడ్కో నిర్మాణాలపై నిర్లక్ష్యం వేళ్లూనుకుంది. ఇక్కడ 2,208 ఇళ్ల నిర్మాణాలను గతంలో తెదేపా ప్రభుత్వమే దాదాపు పూర్తి చేసింది. ఇంకా 4,272 పునాది దశలో ఉండగా వైకాపా ప్రభుత్వం వాటిని పట్టించుకోలేదు. పునాదుల్లో, భవనాల చుట్టూ ముళ్ల చెట్లు పెరిగి చిట్టడవిని తలపిస్తున్నాయి. ఇప్పుడక్కడ ఇళ్లేవో..పునాదులేవో.. తెలియడం లేదు. నిర్మాణాల కోసం తెచ్చిన సామగ్రి పైపులు, ఇనుప సామగ్రి అంతా ఇప్పుడు పనికొస్తాయో లేదో తెలియడం లేదు. కొత్త ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో ఈ నిర్మాణాలు పూర్తి చేసి ఇస్తారని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఈఈ స్వామినాయుడు మాట్లాడుతూ.. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని టిడ్కో గృహ సముదాయాల గురించి ప్రభుత్వానికి నివేదిస్తామని, ఆదేశాల మేరకు చర్యలు చేపడతామని అన్నారు.  

అసంపూర్తిగా ఉన్న ఇళ్ల నిర్మాణం

ఈనాడు, ఏలూరు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని