‘ఇసుక లోడ్‌ చేస్తున్నాం.. దమ్ముంటే ఆపండి’

అనంతపురం జిల్లా బొమ్మనహాళ్‌ మండలంలో ఓ వైకాపా నాయకుడి అనుచరులు సామాజిక మాధ్యమాల్లో రెచ్చగొట్టే పోస్టులు పెట్టడం కలకలం రేపుతోంది.

Published : 24 Jun 2024 05:51 IST

సామాజిక మాధ్యమాల్లో వైకాపా నాయకుడి అనుచరుల పోస్టు

బొమ్మనహాళ్, న్యూస్‌టుడే: అనంతపురం జిల్లా బొమ్మనహాళ్‌ మండలంలో ఓ వైకాపా నాయకుడి అనుచరులు సామాజిక మాధ్యమాల్లో రెచ్చగొట్టే పోస్టులు పెట్టడం కలకలం రేపుతోంది. ‘వాకల్లుదేవనహళ్లి వద్ద వేదవతి హగరిలో ఆదివారం రాత్రి 10.30 గంటలకు, ఉద్దేహాళ్‌ వద్ద అర్ధరాత్రి 12 గంటలకు ఇసుక లోడ్‌ చేస్తున్నాం. పచ్చ పార్టీ నాయకులు దమ్ము, ధైర్యముంటే ఆపండి’ అని కొందరు పోస్టు చేశారు. ఇందుకు తెదేపా నాయకులు స్పందించి ఆ సమయానికి వేదవతి హగరికి చేరుకుని కాపు కాశారు. అయినా ఎవరూ రాలేదు. వారం రోజులుగా ఇక్కడ ఇసుక తరలింపు వివాదాస్పదంగా మారింది. పోలీసులు ట్రాక్టర్లను పట్టుకోవడం, నామమాత్రంగా జరిమానా విధించి అరగంటలో వదిలివేయడం జరుగుతోంది. ఇసుక అక్రమార్కులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని