వారాహి అమ్మవారి దీక్ష చేపట్టనున్న పవన్‌కల్యాణ్‌

ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ బుధవారం నుంచి వారాహి అమ్మవారి దీక్ష చేపట్టనున్నారు. 11 రోజుల పాటు నిర్వహించే ఈ దీక్షలో భాగంగా పండ్లు, ద్రవాహారం మాత్రమే తీసుకుంటారు.

Published : 25 Jun 2024 04:57 IST

ఈనాడు డిజిటల్, అమరావతి: ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ బుధవారం నుంచి వారాహి అమ్మవారి దీక్ష చేపట్టనున్నారు. 11 రోజుల పాటు నిర్వహించే ఈ దీక్షలో భాగంగా పండ్లు, ద్రవాహారం మాత్రమే తీసుకుంటారు. గత ఏడాది జూన్‌లో పవన్‌ వారాహి విజయ యాత్ర చేపట్టారు. ఆ యాత్ర సందర్భంలోనూ అమ్మవారికి పూజలు నిర్వహించి దీక్ష చేపట్టారు. 


పవన్‌కు శుభాకాంక్షలు తెలిపిన విజయవాడ సీపీ

ప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు విజయవాడ పోలీసు కమిషనర్‌ పీహెచ్‌డీ రామకృష్ణ శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో కమిషనర్‌తో పాటు డీసీపీ ఆదిరాజ్‌ రాణా పవన్‌ను కలిశారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయం వద్ద సోమవారం వివిధ వర్గాల ప్రజల నుంచి పవన్‌కల్యాణ్‌ వినతులు స్వీకరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు