అన్నవరం వేదపాఠశాల విద్యార్థులకు అతిసారం

కాకినాడ జిల్లా అన్నవరం దేవస్థానం స్మార్త ఆగమ పాఠశాల విద్యార్థులు బుధవారం అతిసారం బారినపడ్డారు. వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురైన ఎనిమిది మందికి దేవస్థానం సిబ్బంది వైద్యసేవలు అందించారు.

Published : 04 Jul 2024 05:06 IST

కాకినాడలో చికిత్స పొందుతున్న విద్యార్థినిని పరామర్శిస్తున్న డీఎంహెచ్‌వో నరసింహనాయక్‌

అన్నవరం, న్యూస్‌టుడే: కాకినాడ జిల్లా అన్నవరం దేవస్థానం స్మార్త ఆగమ పాఠశాల విద్యార్థులు బుధవారం అతిసారం బారినపడ్డారు. వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురైన ఎనిమిది మందికి దేవస్థానం సిబ్బంది వైద్యసేవలు అందించారు. తాగునీటి నమూనాలు సేకరించి పరీక్షలకు పంపించారు.

కాకినాడలో విదేశీ విద్యార్థినులకు అస్వస్థత

కాకినాడ (మసీదుసెంటర్‌), న్యూస్‌టుడే: కాకినాడలో పలువురు విదేశీ విద్యార్థినులు అతిసారం బారినపడ్డారు. జింబాబ్వే, నైజీరియాకు చెందిన వీరంతా గండేపల్లి మండల పరిధిలోని ఓ కళాశాలలో బి.ఫార్మసీ చదువుతున్నారు. కాకినాడలోని వసతి గృహంలో ఉంటున్న వీరికి మంగళవారం రాత్రి నుంచి వాంతులు, విరేచనాలు మొదలయ్యాయి. వీరిలో ఏడుగురుని స్థానిక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. మరికొందరు ప్రాథమిక చికిత్స తీసుకుని వెళ్లిపోయారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని