ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో బీకాం జనరల్‌ కోర్సు తొలగింపు

ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో బీకాం జనరల్‌ కోర్సును కళాశాల విద్యాశాఖ మూసివేసింది. బీకాం కంప్యూటర్స్‌ ఒక్కటే నిర్వహించేలా నిర్ణయం తీసుకుంది.

Published : 04 Jul 2024 07:43 IST

ఈనాడు, అమరావతి: ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో బీకాం జనరల్‌ కోర్సును కళాశాల విద్యాశాఖ మూసివేసింది. బీకాం కంప్యూటర్స్‌ ఒక్కటే నిర్వహించేలా నిర్ణయం తీసుకుంది. స్వయంప్రతిపత్తి కళాశాలల్లో రెండు కోర్సులు నిర్వహిస్తుండగా.. ఇతర కళాశాలల్లో బీకాం కంప్యూటర్‌ కోర్సు ఒక్కటే అమలు చేయాలని ఆదేశించింది. ప్రవేశాలు తక్కువగా ఉంటున్నందున ఒక్క కోర్సు మాత్రమే నిర్వహించాలని పేర్కొంది. రాష్ట్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు 169 ఉండగా.. స్వయంప్రతిపత్తి కళాశాలలు 21 ఉన్నాయి.

సీఏ చేయాలనుకున్న వారు బీకాం జనరల్‌లోనే ప్రవేశాలు పొందుతారని, కొత్తగా ఈ కోర్సులో వచ్చిన మార్పుల కారణంగా జీఎస్టీ, ఈ-ఫైలింగ్‌ వంటి అంశాలపైన పాఠ్యాంశాలు ఉన్నాయని అధ్యాపకులు పేర్కొంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని