ఎస్టీ గురుకులాల ఉపాధ్యాయులకు ఉద్యోగ భద్రత కల్పిస్తాం

మెగా డీఎస్సీ వల్ల గిరిజన గురుకులాల్లో పొరుగు సేవల కింద పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ఎలాంటి అన్యాయం జరగదని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి స్పష్టం చేశారు.

Published : 04 Jul 2024 05:18 IST

మెగా డీఎస్సీ వల్ల వారికి అన్యాయం జరగదు
మంత్రి సంధ్యారాణి హామీ 

ఈనాడు డిజిటల్, అమరావతి: మెగా డీఎస్సీ వల్ల గిరిజన గురుకులాల్లో పొరుగు సేవల కింద పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ఎలాంటి అన్యాయం జరగదని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి స్పష్టం చేశారు. డీఎస్సీకి వ్యతిరేకంగా నిరసన తెలపడం తగదని హితవు పలికారు. ఎస్టీ గురుకులాల్లో పనిచేస్తున్న 1,143 టీజీటీ, పీజీటీ, పీఈటీ, పీడీ పోస్టుల్ని డీఎస్సీ నోటిఫికేషన్‌ నుంచి మినహాయించాలని సీఎం చంద్రబాబుకు విన్నవించేందుకు ఉండవల్లి వచ్చిన ఉపాధ్యాయులతో బుధవారం ఆమె చర్చలు జరిపారు. 15 ఏళ్లుగా పనిచేస్తున్న తమకు న్యాయం చేయాలని వారు అభ్యర్థించారు. స్పందించిన మంత్రి ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. 20 రోజుల్లో బీవోజీ సమావేశం పెడతామని, కాంట్రాక్ట్‌ రెసిడెన్షియల్‌ టీచర్స్‌గా మార్పు చేసేందుకు ప్రతిపాదనలు రూపొందిస్తామని.. జీతాలు పెంచుతామని వెల్లడించారు. గురువారం నుంచి తామంతా విధులకు హాజరవుతామని ఉపాధ్యాయులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని