100 రోజుల్లో 1.28 లక్షల ఇళ్లు పూర్తి చేస్తాం

రాబోయే వంద రోజుల్లో 1.28 లక్షల ఇళ్లను పూర్తి చేస్తామని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. మిగిలిన 6.75 లక్షల గృహాలను మార్చికల్లా పూర్తి చేసేలా లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని వెల్లడించారు.

Published : 04 Jul 2024 05:19 IST

గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి

ఈనాడు డిజిటల్, అమరావతి: రాబోయే వంద రోజుల్లో 1.28 లక్షల ఇళ్లను పూర్తి చేస్తామని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. మిగిలిన 6.75 లక్షల గృహాలను మార్చికల్లా పూర్తి చేసేలా లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని వెల్లడించారు. రాష్ట్ర సచివాలయంలో గృహ నిర్మాణ శాఖ అధికారులతో బుధవారం మంత్రి సమీక్షించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘రాష్ట్రంలో 8.04 లక్షల ఇళ్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. వీటిలో 5.76 లక్షలు ఇంకా మొదలుపెట్టలేదు. వీటికి రూ.2,000 కోట్లు అవసరం. ఐచ్ఛికం-3 కింద మంజూరైన ఇళ్ల నిర్మాణాన్ని లబ్ధిదారుల తరఫున కొన్ని సంస్థలు చేపట్టాయి. వాటిలో లాభదాయకంగా ఉండే స్థాయి వరకు నిర్మించి మిగిలిన భాగాన్ని వదిలేశారనే ఫిర్యాదులు వచ్చాయి. లబ్ధిదారుల పేర్లపై నిర్మాణ సామగ్రిని అధికంగా తీసుకున్నారని తెలిసింది. వీటిపై విచారణ చేసి.. ఈ నెల 31 లోపు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని అధికారులకు సూచించాం. కొన్ని ప్రాంతాల్లో నిరుపయోగంగా ఉన్న భూములను అధిక ధరలకు కొని ఇళ్ల పట్టాలుగా ఇచ్చారనే దానిపై విచారణ చేస్తాం. గృహనిర్మాణ శాఖాధికారులు లేని ప్రాంతాల్లో సచివాలయాల ఉద్యోగులను వినియోగిస్తాం. దీనిపై పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పవన్‌ కల్యాణ్‌ని కూడా అడిగా’ అని వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు