మహిళా కార్యదర్శులకు పోలీసు బాధ్యతలు.. ప్రభుత్వ నిర్ణయంలో ఏదైనా పురోగతి ఉంటే చెప్పండి

గ్రామ, వార్డు సచివాలయాల్లోని మహిళా సంరక్షణ కార్యదర్శులను పోలీసులుగా పరిగణించాలని గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ, చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై విచారణ మూడు వారాలకు వాయిదా పడింది.

Updated : 04 Jul 2024 06:09 IST

పిటిషనర్లు, ప్రతివాదులకు సూచించిన హైకోర్టు

ఈనాడు, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల్లోని మహిళా సంరక్షణ కార్యదర్శులను పోలీసులుగా పరిగణించాలని గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ, చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై విచారణ మూడు వారాలకు వాయిదా పడింది. ఈ వ్యవహారంపై కొత్త ప్రభుత్వ నిర్ణయంలో ఏదైనా పురోగతి ఉంటే తెలపాలని పిటిషనర్లు, ప్రతివాదులను హైకోర్టు సూచించింది. ఈ పిటిషన్లపై తీర్పు రిజర్వు అయినప్పటికీ వాటిని మళ్లీ విచారించాలని ధర్మాసనం నిర్ణయించింది. న్యాయమూర్తులు జస్టిస్‌ యు.దుర్గాప్రసాదరావు, జస్టిస్‌ వెంకట జ్యోతిర్మయితో కూడిన ధర్మాసనం బుధవారం ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని