టీడీఆర్‌ బాండ్ల కుంభకోణంపై సమగ్ర విచారణ చేయిస్తాం

వైకాపా ప్రభుత్వ హయాంలో జారీ అయిన టీడీఆర్‌ బాండ్లలో భారీ కుంభకోణం చోటుచేసుకుందని, ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ చేయిస్తామని, బాధ్యులైన వారందరిపైనా చర్యలుంటాయని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ స్పష్టంచేశారు.

Published : 05 Jul 2024 04:32 IST

పురపాలక శాఖ మంత్రి నారాయణ

పట్టణాభివృద్ధి సంస్థలపై సమీక్ష నిర్వహిస్తున్న మంత్రి నారాయణ. చిత్రంలో మున్సిపల్‌ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్, ఇతర ఉన్నతాధికారులు

ఈనాడు డిజిటల్, అమరావతి: వైకాపా ప్రభుత్వ హయాంలో జారీ అయిన టీడీఆర్‌ బాండ్లలో భారీ కుంభకోణం చోటుచేసుకుందని, ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ చేయిస్తామని, బాధ్యులైన వారందరిపైనా చర్యలుంటాయని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ స్పష్టంచేశారు. తణుకులో రూ.36 కోట్లకు బదులు రూ.700 కోట్ల విలువైన టీడీఆర్‌ బాండ్లను జారీ చేశారని, ఇది అతిపెద్ద కుంభకోణమన్నారు. ఇందుకు సంబంధించిన ప్రాథమిక నివేదిక ఇప్పటికే వచ్చిందని.. పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు. తిరుపతిలో విడుదల చేసిన బాండ్లపైనా విచారణ ఉంటుందని చెప్పారు. సచివాలయంలో పట్టణ సంస్థల అధికారులతో గురువారం ఆయన సమీక్ష నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కోసం ఏర్పాటు చేసిన పట్టణాభివృద్ధి సంస్థల నిధుల్ని వినియోగించకుండా వైకాపా ప్రభుత్వం దారి మళ్లించిందని చెప్పారు. పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలో మౌలిక వసతుల్ని మెరుగు పరిచేందుకు పటిష్ఠమైన చర్యలు తీసుకుంటామన్నారు. ‘నెల్లూరు, వైఎస్సార్‌ జిల్లాల్లోని లేఅవుట్లలో అవకతవకలు జరిగినట్లు గుర్తించి, విచారణకు కమిటీ వేశాం. నివేదిక రాగానే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం’ అని మంత్రి నారాయణ చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని