సీతానగరంలో అతిసారం కలకలం

తూర్పుగోదావరి జిల్లా సీతానగరం గ్రామ పంచాయతీ పరిధిలో అతిసారం కేసులు కలవరపెడుతున్నాయి. లంకూరు, దళితపేట, వడ్డెరపేట పరిధిలోని పలు కుటుంబాలకు చెందిన సుమారు 20 మందికి గురువారం వేకువజాము నుంచి వాంతులు, విరేచనాలు మొదలయ్యాయి.

Published : 05 Jul 2024 04:32 IST

20 మందికి పైగా అస్వస్థత

అతిసారం బారిన పడిన కుమార్తెను సీతానగరం పీహెచ్‌సీకి తీసుకొస్తున్న మహిళ

సీతానగరం, న్యూస్‌టుడే: తూర్పుగోదావరి జిల్లా సీతానగరం గ్రామ పంచాయతీ పరిధిలో అతిసారం కేసులు కలవరపెడుతున్నాయి. లంకూరు, దళితపేట, వడ్డెరపేట పరిధిలోని పలు కుటుంబాలకు చెందిన సుమారు 20 మందికి గురువారం వేకువజాము నుంచి వాంతులు, విరేచనాలు మొదలయ్యాయి. దీంతో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు పరుగులు తీశారు. కొందరి పరిస్థితి విషమించడంతో రాజమహేంద్రవరంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తాగునీటి ట్యాంకుల్లో కొంగలు పడి చనిపోవడం, మరికొన్ని చోట్ల ఎన్నికలకు ముందు వైకాపా నాయకులు హడావుడిగా తాగునీటి గొట్టాలను డ్రైనేజీల్లోంచి నుంచి వేయడంతో తాగునీరు కలుషితం అవుతోందని స్థానికులు చెబుతున్నారు. బుధవారం ఓ ఆటోలో వచ్చిన చేపలను కొని తినడం కూడా ఈ పరిస్థితికి కారణం కావొచ్చని భావిస్తున్నారు. తాగునీటిని పరీక్షలకు పంపామని, వైద్యశిబిరాలు ఏర్పాటుచేశామని అధికారులు తెలిపారు.

పిడుగురాళ్లలో బాలుడి మృతి

పిడుగురాళ్ల, న్యూస్‌టుడే: పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పరిధిలో పదుల సంఖ్యంలో అతిసారం బాధితులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. లెనిన్‌నగర్‌కు చెందిన అబుబకర్‌ సిద్ధిక్‌ (9) రెండురోజుల నుంచి వాంతులు, విరేచనాలతో బాధపడుతూ బుధవారం రాత్రి మృతి చెందాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని