పందిరి కిందే పాఠాలు

 పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం గంగన్నదొరవలస గ్రామంలోని ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు అవస్థలు తప్పడం లేదు.

Published : 05 Jul 2024 04:34 IST

 పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం గంగన్నదొరవలస గ్రామంలోని ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు అవస్థలు తప్పడం లేదు. ఇక్కడ ఒకటి నుంచి అయిదో తరగతి వరకు 28 మంది చదువుతున్నారు. గతంలో ఉన్న భవనం శిథిలం కావడంతో దాన్ని తొలగించారు. గత ప్రభుత్వం నాడు నేడు రెండో విడతలో ఎంపిక చేసి భవన నిర్మాణానికి  రూ.35.60 లక్షలు మంజూరు చేసింది. అందులో రూ.8 లక్షలు మాత్రమే విడుదల చేయడంతో వంట గది నిర్మాణం, మరుగుదొడ్లు పూర్తయ్యాయి. తరగతి భవనాన్ని పునాది స్థాయిలోనే గుత్తేదారు వదిలేశారు. మూడు, నాలుగు, అయిదు తరగతులకు గ్రామంలోని ఓ అద్దె ఇంట్లో, ఒకటి, రెండు తరగతుల విద్యార్థులకు ఇలా పందిరి కింద బోధిస్తున్నారు. గతంలో ఇక్కడ 40 మంది విద్యార్థులు ఉండగా, ఈ ఏడాది ఆ సంఖ్య 28కి తగ్గింది. దీనిపై ఎంఈవో రాజ్‌కుమార్‌ వద్ద ప్రస్తావించగా.. నిధులు రాకపోవడంతో పనులు ఆపేసినట్లు చెప్పారు.

న్యూస్‌టుడే, సాలూరు గ్రామీణం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని