రాష్ట్రంలో ఆస్పత్రుల ఏర్పాటుపై ‘ఎం-42’ ఆసక్తి

రాష్ట్రంలో పుష్కల వనరులు, అపార అవకాశాలు ఉన్నాయని.. ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని అబుదాబికి చెందిన ఎం-42 సంస్థ ప్రతినిధులకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ ఆహ్వానం పలికారు.

Published : 05 Jul 2024 04:37 IST

ఆ సంస్థ ప్రతినిధులతో మంత్రి సత్యకుమార్‌ చర్చలు

ఎం-42 సంస్థ ప్రతినిధులతో చర్చిస్తున్న మంత్రి సత్యకుమార్‌. చిత్రంలో వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి యువరాజ్‌ తదితరులు

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో పుష్కల వనరులు, అపార అవకాశాలు ఉన్నాయని.. ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని అబుదాబికి చెందిన ఎం-42 సంస్థ ప్రతినిధులకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ ఆహ్వానం పలికారు. మంగళగిరిలోని వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యాలయంలో గురువారం ఆ సంస్థ హెడ్‌ ఆఫ్‌ గ్లోబల్‌ పార్టనర్‌షిప్‌ లారెన్స్‌ నేతృత్వంలోని బృందంతో మంత్రి సమావేశమయ్యారు. రాష్ట్రంలో బల్క్‌ డ్రగ్‌ పార్క్‌ మొదటి స్థానంలో ఉందని, సుమారు 170 ఎకరాల్లో విస్తరించి ఉన్న మెడ్‌టెక్‌ జోన్, మూడు ఎకనామిక్‌ జోన్లలో పెట్టుబడులు పెట్టేందుకు అనువైన వాతావరణం ఉందని వివరించారు. సింగిల్‌ విండో విధానం ద్వారా సహకారం అందిస్తామని, ప్రభుత్వపరంగా రాయితీలు ఉంటాయని వారికి తెలిపారు. ముబదల హెల్త్‌ గ్రూపు ఎం-42 పేరుతో 20 దేశాల్లో కార్యకలాపాలు సాగిస్తోంది. ఈ సందర్భంగా మంత్రి విలేకరులతో మాట్లాడారు. అమరావతి ప్రాంతంలోని హెల్త్‌ సిటీలో గానీ, ఎంపిక చేసిన తొమ్మిది మున్సిపాలిటీల్లోని హెల్త్‌ హబ్‌ల్లో గానీ ఎం-42 పెట్టుబడులు పెట్టే అవకాశం ఉందని పేర్కొన్నారు. ముఖ్యంగా ఆస్పత్రుల ఏర్పాటుపై ఆ సంస్థ ప్రతినిధులు ఆసక్తి కనబరిచారని వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని