ఆగస్టు 16 నుంచి విజయవాడ-ముంబయి విమాన సర్వీస్‌

విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ముంబయికి ప్రత్యేక సర్వీస్‌ను నడిపేందుకు ఇండిగో సంస్థ ముందుకొచ్చింది.

Published : 05 Jul 2024 04:39 IST

గన్నవరం గ్రామీణం, న్యూస్‌టుడే: విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ముంబయికి ప్రత్యేక సర్వీస్‌ను నడిపేందుకు ఇండిగో సంస్థ ముందుకొచ్చింది. ఆగస్టు 16 నుంచి సర్వీస్‌ను ప్రారంభిస్తామని ప్రకటించింది. 180 సీట్లు ఉండే ఈ విమానం సాయంత్రం 6:30 గంటలకు ముంబయిలో బయలుదేరి రాత్రి 8:20 గంటలకు గన్నవరం చేరుకుంటుంది. తిరిగి రాత్రి 9 గంటలకు బయలుదేరి రాత్రి 11 గంటలకు ముంబయిలో ల్యాండ్‌ అవుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని