చంద్రబాబుకు థాంక్స్‌ చెప్పడానికి బైక్‌ యాత్ర

విదేశీ విద్యా పథకాన్ని ఎన్డీయే ప్రభుత్వం పునఃప్రారంభిస్తున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌లకు ధన్యవాదాలు తెలపడానికి మక్బుల్‌జాన్‌ అనే మహిళ ద్విచక్ర వాహన యాత్ర చేపట్టారు.

Published : 05 Jul 2024 05:49 IST

గోరంట్లలో మక్బుల్‌జాన్‌కు స్వాగతం పలుకుతున్న తెదేపా, మైనారిటీ నాయకులు

విదేశీ విద్యా పథకాన్ని ఎన్డీయే ప్రభుత్వం పునఃప్రారంభిస్తున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌లకు ధన్యవాదాలు తెలపడానికి మక్బుల్‌జాన్‌ అనే మహిళ ద్విచక్ర వాహన యాత్ర చేపట్టారు. శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలో యాత్ర ప్రారంభించిన ఆమె.. గురువారం సాయంత్రం గోరంట్లకు చేరుకున్నారు. 2020లో  ఈ పథకాన్ని అమలు చేయాలని కోరుతూ సుమారు 800 కి.మీ. బైక్‌ యాత్ర మొదలు పెట్టానని ఆమె తెలిపారు. అది పూర్తయ్యాక అప్పటి సీఎం జగన్‌ను కలవడానికి వెళితే కనీసం గేటు వద్దకు రానివ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పథకాన్ని ఎన్డీయే ప్రభుత్వం తిరిగి ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. 

న్యూస్‌టుడే, గోరంట్ల

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని