ఇదీ ‘నాడు-నేడు’ ప్రగతి

నంద్యాల జిల్లా డోన్‌ జిల్లాపరిషత్‌ బాలికల ఉన్నత పాఠశాలలో చెట్ల నీడే తరగతి గదిగా మారింది. ఇక్కడ 1800 మంది విద్యార్థినులు చదువుతున్నారు.

Published : 06 Jul 2024 03:59 IST

నంద్యాల జిల్లా డోన్‌ జిల్లాపరిషత్‌ బాలికల ఉన్నత పాఠశాలలో చెట్ల నీడే తరగతి గదిగా మారింది. ఇక్కడ 1800 మంది విద్యార్థినులు చదువుతున్నారు. అవసరమైన మేర గదులు లేకపోవడంతో ఒక్కో చెట్టు కింద ఒక్కో తరగతిని నిర్వహిస్తున్నారు. పది అదనపు తరగతి గదుల నిర్మాణానికి రూ.1.26 కోట్లను నాడు-నేడు రెండో దశ కింద మంజూరు చేశారు. గ్రౌండ్‌ఫ్లోర్‌లో నాలుగు గదులు, దానిపైన నాలుగు, దానిపై రెండు గదుల చొప్పున నిర్మించాలని నిర్ణయించారు. ఇప్పటికి 30 శాతం పనులే పూర్తయ్యాయి. మే నెలలో రూ.రెండున్నర లక్షలు విడుదలయ్యాయి. సిమెంటు లేక శ్లాబ్‌ పనులనూ చేపట్టలేదు. పాత భవనంలోని రెండు గదుల్లో పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలను ఉంచారు. కొన్ని గదుల్లో తరగతులను నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ గదుల కొరత వల్ల ఆరుబయట చెట్ల కింద బోధిస్తున్నారు. వర్షాలు కురిస్తే పరిస్థితి ఏంటని విద్యార్థినులు, తల్లిదండ్రులు వాపోతున్నారు.   

న్యూస్‌టుడే, డోన్‌ పట్టణం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని