దాత ఔదార్యం.. చేరువైన వైద్యం

ఏపీలోని కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం యనమలకుదురు వాసుల కల నేరనుంది. ఇప్పటిదాకా ఇక్కడి పేదలు ఉచిత వైద్యం కోసం పెనమలూరు మండల పీహెచ్‌సీకి వెళ్లేవారు.

Updated : 06 Jul 2024 06:49 IST

రూ.4.5 కోట్ల విరాళంతో దాత విజయలక్ష్మి నిర్మించిన ఆస్పత్రి

పెనమలూరు, న్యూస్‌టుడే: ఏపీలోని కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం యనమలకుదురు వాసుల కల నేరనుంది. ఇప్పటిదాకా ఇక్కడి పేదలు ఉచిత వైద్యం కోసం పెనమలూరు మండల పీహెచ్‌సీకి వెళ్లేవారు. స్థానికంగా ఆసుపత్రి నిర్మాణానికి నిధులు, స్థలం వంటి అడ్డంకులు ఎదురయ్యాయి. ఇటీవల తాడిగడప మున్సిపాలిటీ 0.36 సెంట్ల స్థలాన్ని కేటాయించింది. ఈ తరుణంలో తన భర్త వెలగపూడి ఉమామహేశ్వరరావు జ్ఞాపకార్థం వెలగపూడి ట్రస్టు నిర్వాహకురాలు విజయలక్ష్మి రూ. 4.5 కోట్ల విరాళం ఇచ్చారు. ఈ నిధులతో భవన నిర్మాణంతో పాటు పడకలు, అధునాతన సాంకేతికతతో కూడిన ల్యాబొరేటరీ, పరికరాలను సమకూర్చారు. ఈ ఆరోగ్య కేంద్రాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ శనివారం ప్రారంభించనున్నారు. ఇక్కడ ఓ వైద్యుడు, ఇద్దరు స్టాఫ్‌నర్సులు, ఇద్దరు సిబ్బంది, ఐదుగురు ఏఎన్‌ఎంలు, 28 మంది ఆశా వర్కర్లు సేవలు అందించనున్నట్లు మండల ఆరోగ్య వైద్యాధికారి శ్రీనివాస్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు