39 శాతం తక్కువ రేటుకే పనిచేస్తాం!

కేంద్ర ఉపరితల రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ (మోర్త్‌) పిలిచిన టెండర్లలో రెండు బైపాస్‌ రోడ్ల పనులను అంచనా కంటే ఎంతో తక్కువ మొత్తానికి కోట్‌ చేసి, గుత్తేదారులు పనులు దక్కించుకున్నారు.

Published : 06 Jul 2024 04:52 IST

కనిగిరి బైపాస్‌ టెండరులో మతలబు
రేపల్లె బైపాస్‌ పనులూ 31 శాతం తక్కువకే 

ఈనాడు, అమరావతి: కేంద్ర ఉపరితల రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ (మోర్త్‌) పిలిచిన టెండర్లలో రెండు బైపాస్‌ రోడ్ల పనులను అంచనా కంటే ఎంతో తక్కువ మొత్తానికి కోట్‌ చేసి, గుత్తేదారులు పనులు దక్కించుకున్నారు. 5.5. కి.మీ. మేర కనిగిరి బైపాస్‌కు రూ.45.45 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లు పిలిస్తే.. 10 సంస్థలు పోటీపడ్డాయి. వీటిలో శ్రీసాయినాథ్‌ కన్‌స్ట్రక్షన్స్‌ సంస్థ అంచనా కంటే 39 శాతం తక్కువగా రూ.27.72 కోట్లకే పనిచేస్తామని కోట్‌చేసి పని దక్కించుకుంది.

 2.5 కి.మీ. మేర రేపల్లె బైపాస్‌ రోడ్డు పనులకు రూ.19.36 కోట్ల అంచనా వ్యయంతో టెండరు పిలిస్తే 9 సంస్థలు బిడ్లు వేశాయి. ఇందులో యూబీఎస్‌ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్‌ సంస్థ అంచనా కంటే 31 శాతం తక్కువకు కోట్‌ చేసింది. రూ.13.34 కోట్లకే పనిచేస్తామంటూ టెండరు దక్కించుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని