11న ట్రిపుల్‌ఐటీల్లో ప్రవేశాలకు జనరల్‌ కౌన్సెలింగ్‌ జాబితా విడుదల

ఆర్జీయూకేటీ పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు క్యాంపస్‌లలో ఆరేళ్ల సమీకృత బీటెక్‌ ఇంజినీరింగ్‌ కోర్సులో ప్రవేశాలకు 2024-25 సంవత్సరానికి సంబంధించి ప్రత్యేక కేటగిరీ అభ్యర్థుల దరఖాస్తుల పరిశీలన శుక్రవారంతో ముగిసిందని ట్రిపుల్‌ ఐటీల ప్రవేశాల సమన్వయకర్త   ఎస్‌.అమరేంద్రకుమార్‌ తెలిపారు.

Published : 06 Jul 2024 04:57 IST

నూజివీడు పట్టణం, న్యూస్‌టుడే: ఆర్జీయూకేటీ పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు క్యాంపస్‌లలో ఆరేళ్ల సమీకృత బీటెక్‌ ఇంజినీరింగ్‌ కోర్సులో ప్రవేశాలకు 2024-25 సంవత్సరానికి సంబంధించి ప్రత్యేక కేటగిరీ అభ్యర్థుల దరఖాస్తుల పరిశీలన శుక్రవారంతో ముగిసిందని ట్రిపుల్‌ ఐటీల ప్రవేశాల సమన్వయకర్త   ఎస్‌.అమరేంద్రకుమార్‌ తెలిపారు. క్యాంపస్‌ల వారీగా జనరల్‌ కౌన్సెలింగ్‌కు ఎంపిక చేసిన విద్యార్థుల తుది జాబితా ఈ నెల 11న విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఎన్‌సీసీ విభాగంలో 1,141, భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ విభాగంలో 162, క్యాప్‌ విభాగంలో 167, దివ్యాంగుల విభాగంలో 249, క్రీడా విభాగంలో 796 మంది విద్యార్థుల దరఖాస్తులు పరిశీలించినట్లు వివరించారు. 

ఎంపికైన విద్యార్థుల ధ్రువపత్రాల పరిశీలన 

  • నూజివీడు: జులై 22, 23 తేదీల్లో.. 
  • ఇడుపులపాయ: జులై 22, 23
  •  ఒంగోలు: జులై 24, 25
  •  శ్రీకాకుళం: జులై 26, 27
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని