లీకేజీల పాపం.. వైకాపా శాపం!

ఏలూరు జిల్లా పోలవరం మండలం పట్టిసీమ వద్ద గోదావరి నదిపై నిర్మించిన ఎత్తిపోతల పథకం నిర్వహణను వైకాపా ప్రభుత్వం గాలికొదిలేయడంతో.. దాని దుష్ప్రభావాలు ఇప్పుడు బయటపడుతున్నాయి.

Published : 06 Jul 2024 05:03 IST

పట్టిసీమ ఎయిర్‌వాల్వు నుంచి ఎగిసిపడిన నీరు 

ఎయిర్‌వాల్వు నుంచి లీకవుతున్న నీరు

పోలవరం, న్యూస్‌టుడే: ఏలూరు జిల్లా పోలవరం మండలం పట్టిసీమ వద్ద గోదావరి నదిపై నిర్మించిన ఎత్తిపోతల పథకం నిర్వహణను వైకాపా ప్రభుత్వం గాలికొదిలేయడంతో.. దాని దుష్ప్రభావాలు ఇప్పుడు బయటపడుతున్నాయి. పైపులైన్లు, వాల్వులను ఇన్నేళ్లు నిర్వహించకపోవడంతో ఇప్పుడు  లీకేజీలు వేధిస్తున్నాయి. మూడు రోజుల కిందట ఎత్తిపోతల పంపుల నుంచి మంత్రి నిమ్మల రామానాయుడు నీళ్లు వదిలారు. అప్పటి నుంచి పంపు హౌస్‌ నుంచి డెలివరీ సిస్టమ్‌ వరకు 4.30 కిలోమీటర్ల పొడవున ఉన్న పైపులైన్‌ మార్గంలోని ఎయిర్‌వాల్వుల వద్ద నుంచి నీరు లీకవుతోంది.

కృష్ణారావుపేట సమీపంలో ఎయిర్‌వాల్వు నుంచి ఎగసిపడుతున్న నీరు

లీకేజీ కారణంగా ఆయకట్టు పరిధిలోని నారుమళ్లు మునిగి దెబ్బతింటున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ లీకేజీ శుక్రవారం ఉదయం 9గంటలకు 25 అడుగుల ఎత్తున ఎగిసిపడింది. కృష్ణారావుపేట సమీపంలో 2.30 కిలోమీటరు వద్ద ఇలా భారీగా నీరు వృథా కావడంతో రైతులు ఎత్తిపోతల అధికారులకు సమాచారం ఇచ్చారు. లీకైన పంపును గుర్తించి సరిచేసి, తిరిగి సాయంత్రం 4.30 గంటలకు యథావిధిగా నీటి విడుదలను కొనసాగించినట్లు పర్యవేక్షణ డీఈ పెద్దిరాజు చెప్పారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని