మొక్కులు తీర్చుకున్న అమరావతి రైతులు

తమ పూజల ఫలితంగా సకల దేవతలు కరుణించి, రాక్షస పాలనకు చరమగీతం పాడి ప్రజా పాలనకు పట్టం కట్టారని పలువురు అమరావతి రైతులు ఆనందం వ్యక్తం చేశారు.

Published : 06 Jul 2024 05:04 IST

వినాయకుడిని దర్శించుకున్న అమరావతి రైతులు 

కాణిపాకం, న్యూస్‌టుడే: తమ పూజల ఫలితంగా సకల దేవతలు కరుణించి, రాక్షస పాలనకు చరమగీతం పాడి ప్రజా పాలనకు పట్టం కట్టారని పలువురు అమరావతి రైతులు ఆనందం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం రావడంపై శుక్రవారం 150 మంది రైతులు చిత్తూరు జిల్లా కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయకస్వామి వారిని దర్శించుకున్నారు. మొక్కులు తీర్చుకొని విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర రాజధానిగా అమరావతి కొనసాగాలని 1,631 రోజుల పాటు రైతులు చేసిన దీక్ష ఫలితంగా ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారన్నారు. సీఎం చంద్రబాబుపై నమ్మకంతో తరతరాలుగా వస్తున్న భూములను రైతులు రాజధాని కోసం త్యాగం చేశారని తెలిపారు. కూటమి ప్రభుత్వం రావడంతో రాజధాని నిర్మాణం వేగంగా పూర్తిచేయాలని ఆకాంక్షించారు. వీరి వెంట ఆలయ మాజీ ఛైర్మన్‌ మణినాయుడు, కాణిపాకం మాజీ సర్పంచి కేసీ మధుసూదన్‌రావు, తెదేపా నాయకులు కేసీ పూర్ణచంద్రరావు, నరసింహులు నాయుడు, శేషాద్రినాయుడు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని