ప్రజాదర్బార్‌కు వినతుల వెల్లువ

రాష్ట్ర మానవవనరులు, ఐటీశాఖల మంత్రి నారా లోకేశ్‌ శుక్రవారం నిర్వహించిన ప్రజాదర్బార్‌కు.. మంగళగిరి నియోజకవర్గం నుంచే కాకుండా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చి తమ సమస్యలు విన్నవించారు.

Published : 06 Jul 2024 05:45 IST

గంజాయి బ్యాచ్‌ ఆగడాలపై ఫిర్యాదులు
పింఛన్ల మంజూరు కోరుతూ మరికొన్ని..

తమ సమస్యలు పరిష్కరించాలని లోకేశ్‌కు వినతిపత్రం అందిస్తున్న మహిళలు 

మంగళగిరి, న్యూస్‌టుడే: రాష్ట్ర మానవవనరులు, ఐటీశాఖల మంత్రి నారా లోకేశ్‌ శుక్రవారం నిర్వహించిన ప్రజాదర్బార్‌కు.. మంగళగిరి నియోజకవర్గం నుంచే కాకుండా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చి తమ సమస్యలు విన్నవించారు. ఓపిగ్గా వారి సమస్యలు విన్న ఆయన.. వినతులను సంబంధిత అధికారులకు పంపి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తాడేపల్లి పట్టణంలోని గోరా కాలనీకి చెందిన యువకులు గంజాయి మత్తులో దాడులకు పాల్పడుతున్నారని బాధితులు ఆంజనేయ ప్రసాద్, మాచర్ల అఖిల్‌ ఆవేదన వ్యక్తం చేశారు. స్థానికంగా ఉండే కట్టా భరత్‌ అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడని, తన తల్లిదండ్రుల్ని హతమారుస్తానని బెదిరించాడని ఆంజనేయ ప్రసాద్‌ లోకేశ్‌కు వివరించారు. అనారోగ్యం బారిన పడటంతో ఇద్దరు పిల్లల చదువు భారంగా మారిందని, ఆర్థిక సాయం చేయాలని ఉండవల్లికి చెందిన వై.దుర్గ, మంచానికే పరిమితమైన తన కుమార్తెకు దివ్యాంగ పింఛను మంజూరు చేయించాలని గుంటుపల్లికి చెందిన వెలమాటి శ్రీనివాస్‌కుమార్‌ వేడుకున్నారు. విద్యుత్తు బిల్లు కారణంగా గత ప్రభుత్వం తొలగించిన రేషన్‌కార్డు, పింఛను పునరుద్ధరించాలని మంగళగిరికి చెందిన వీరభద్రరావు కోరారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని